LAKSHMI VENKATESWARA SWAMY BRAHMOTSAVAMS FROM JAN 22-30 _ జనవరి 22 నుండి 30వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం
JEO RELEASES THE POSTERS
TIRUPATI, 19 JANUARY 2023: The annual fete in Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa of YSR Kadapa District will be observed between January 22 to 30 said TTD JEO Sri Veerabrahmam.
The JEO inspected the temple along with the officials to verify the ongoing arrangements and conducted a review meeting. He released the related posters on the occasion.
Later speaking to media he said, the Ankurarpana will be on January 21 and the important days includes Garuda Vahanam on January 26, Radhotsavam on January 28, Pushpayagam on January 31.
The JEO also inspected the sub-temples to observe the status of ongoing development works including the construction of new temple at 108 feet statue of Tallapaka Annamacharya in Tallapaka district and others.
DyEO Sri Natesh Babu, VGO Sri Manohar, DE Sri Chandrasekhar and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 22 నుండి 30వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు – టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం
– అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
తిరుపతి, 19 జనవరి 2023: వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 22 నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. జెఈఓ గురువారం ఆలయాన్ని సందర్శించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం జెఈఓ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు జనవరి 21వ తేదీన అంకురార్పణ జరగనుందని తెలిపారు. ప్రధానంగా జనవరి 26న గరుడవాహనం, 28న రథోత్సవం జరుగుతాయని వివరించారు. జనవరి 31న పుష్పయాగం జరుగనుందని చెప్పారు. టిటిడి ఇంజినీరింగ్ అధికారులు రథం పటిష్టతను పరిశీలించారని తెలిపారు. భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారి వాహన సేవలను దర్శించాలని కోరారు.
అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
అన్నమయ్య జిల్లాలోని తాళ్లపాక 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద రూ.50 లక్షలతో జరుగుతున్న శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ పనులను జెఈఓ పరిశీలించారు. రూ.45 లక్షలతో చేపడుతున్న అన్నమయ్య విగ్రహం వద్ద నూతన వేదిక, రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆ తరువాత అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పనులు, ఎలక్ట్రికల్, సివిల్ పనులు, భక్తులకు తాగునీటి సౌకర్యం, పుష్కరిణి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, విజిఓ శ్రీ మనోహర్, డిఇ శ్రీ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.