LIST OF FESTIVALS IN SRI KRT IN NOVEMBER_ నవంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

November 4, 11, 18 and 25 : Abhishekam to Mula Virat in the mornings and Golden Tiruchi procession in the evenings

November 4: Karthika Pournima and Astottara Seva

November 9: Sri Sita Rama Kalyanam on the advent of Punarvasu Nakshatram

November 18: Sahasra Kalasabhishekam in the morning and Hanumantha Vahana Seva in the evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2017, అక్టోబరు 30: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– నవంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు స్వామి, అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ. 20- చెల్లించి అభిషేకసేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు బంగారు తిరుచ్చిలో ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– నవంబరు 4వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.00 గంటలకు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.50- చెల్లించి శతకళాశాభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– నవంబరు 9వ తేదీన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు చేపట్టి అక్కడే ఊంజల్‌సేవ చేపడతారు. భక్తులు రూ. 500- చెల్లించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

– నవంబరు 18వ తేదీ అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.30 గంటలకు ఆలయంలో సహస్ర కళాశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.500- చెల్లించి సహస్ర కశాభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా రాత్రి 7.00 గంటలకు శ్రీకోదండరామస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.