LOKA MATA AND JAGANNADHA ARE ONE THE SAME-SWAMIJI _ లక్ష్మీనారాయణులు అభేదం : శ్రీశ్రీశ్రీ అనుపమానంద మహరాజ్
Tiruchanoor, 29 Nov. 19: The Universal Mother Sri Lakshmi Devi and Srimannarayana are one and the same said, Sri Anupamananda Maharaj Swamiji, the President of Ramakrishna Mutt, Tirupati.
During his religious discourse as a part of the Srinivasa Veda Vidwat Sadas held at Asthana Mandapam at Tiruchanoor on Friday, he said even the Vedas have depicted that in Hindu Sanatana Dharma, both Lokamata and Jagannatha are one and the same in the creation of the entire Universe. That is why women is given utmost respectable place in our society”, he added.
The Swamiji later lauded the efforts of TTD in spreading Hindu Sanatana Dharma through various dharmic activities.
Estates Officer Sri Vijaya Saradhi, SVHVS Project officer Dr A Vibhishana Sharma were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
లక్ష్మీనారాయణులు అభేదం : శ్రీశ్రీశ్రీ అనుపమానంద మహరాజ్
తిరుపతి, నవంబరు 29, 2019: జగత్తును సృష్టించిన లోకమాత శ్రీ లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు వేరువేరు కాదని, ఇద్దరూ ఒక్కరేనని తిరుపతిలోని రామకృష్ణ మఠం కార్యదర్శి శ్రీశ్రీశ్రీ అనుపమానంద మహరాజ్ ఉద్ఘాటించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో భాగంగా ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం శ్రీశ్రీశ్రీ అనుపమానంద మహరాజ్ “వేదం – మాతృవందనం” అనే అంశంపై అనుగ్రహ భాషణం చేశారు. శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మీదేవికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడని, వేదాలు కూడా మాతృమూర్తికి విశిష్టమైన స్థానం కల్పించాయని తెలిపారు. తిరుచానూరులో వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారు జగన్మాతగా భక్తులను అనుగ్రహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా ఆర్జించాలని, కోరికలు తీర్చుకోవాలని, అప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందని వివరించారు. ఆత్మజ్ఞానంతో భగవంతుని ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుందన్నారు. అంతకుముందు వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో(రెవెన్యూ, పంచాయతి) శ్రీ విజయసారధి, పలువురు వేదపండితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.