LORD AS RAMA GRACE ON FLOAT_ వైభవంగా శ్రీ‌వారి తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

Tirumala, 16 Mar. 19: On the first day of the ongoing five day Teppotsavams in Tirumala on Sunday, Sri Ramachandra Murthy took celestial ride on finely decked float.

The Lord accompanied by Sita, Lakshmana and Anjaneya took three rounds on the Teppa in Swamy Pushkarini. The entire temple tank was decorated with electrical illumination which provided feast to the eyes of pilgrims.

TTD EO Sri Anil Kumar Singhal, former EO Sri LV Subramanyam, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Gopinath Jatti and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ‌వారి తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

తిరుమల, 2019 మార్చి 16: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శ‌నివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో చల్లటి సాయంత్రం వేళ స్వామివారు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పరవశించి పోయారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.

అనంత‌రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ తెప్పోత్స‌వాలలో మొద‌టి రోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పపై భక్తులకు దర్శనమిచ్చార‌న్నారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తార‌ని, మూడవ రోజు మార్చి 18న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తార‌న్నారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించ‌నున్న‌ట్లు తెలిపారు.

టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పంచాంగాన్నిటిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించినట్లు తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.