LORD BLESSED DEVOTEES IN MOHINI AVATARAM _ మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు
Tirumala, 20 Oct. 20: On day -5, Tuesday of the Srivari Navaratri Brahmotsavam Sri Malayappa Swamy blessed devotees in bewitching Mohini alankaram on a decorated palanquin.
The beauty of the Mohini gave the cosmic damsel, on the colourfully decked palanquin on the fifth day of ongoing Navartri Brahmotsavams.
Contrary to daily routine of vahana seva during Covid environment at Kalyana Mandapam, the grand and richly decorated palanquins were paraded from Ranganayakula mandapam to Kalyana mandapam inside the Srivari temple Due to Covid-19 restrictions.
Legends say that the Lord’s appearance as bejeweled and charming Mohini threw the demons (Asura) in confusion and brought victory for Devatas in the celestial battle. The objective of the Mohini Avatara also indicates that the entire universe is spell bound under the Mystic Moha and Maya and that Sri Venkateshwara is the kingpin and key architect of this high drama in the universe.
In other words, through Mohini Avatara, the Lord cautioned his devotees not to fall prey to worldly pleasures and come out of that “Maya” to pursue righteous deeds.
Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, MP Sri Vemireddy Prabhakara Reddy, Board members Sri Chavireddy Bhaskar Reddy, Sri Ramesh Shetty, Smt Prashanti Reddy, Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Sri Kumaruguru, Sri Dushyanthkumar Das, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల, 2020 అక్టోబరు 20: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు
.
మోహినీ అవతారం – మాయా మోహ నాశనం
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత, శ్రీ చిప్పగిరి ప్రసాద్, శ్రీ గోవిందహరి, శ్రీ డిపి.అనంత, శ్రీ కుమారగురు, శ్రీ రమేష్ శెట్టి, శ్రీ దుస్మంత కుమార్ దాస్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
గరుడ వాహనం –
కాగా రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షించనున్నారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.