LORD CASTS DIVINE SPELL ON CHANDRA PRABHA _ చంద్రప్రభవాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 6 October 2019: On the seventh-day pleasant evening, Sri Malayappa Swamy as Dhanwantari, the Lord of Medicine, glided swiftly along four Mada streets to bless His devotees on Sunday.
Moon is often considered to cast his spell for the healthy growth of medicinal seedlings and green vegetation. He is worshipped for his cool attitude, charm and pleasantness.
By taking a ride on Chandra Prabha Vahanam as Dhanwantari, Lord sent a message that when His blessings are there, the entire biome will prosper in a healthy manner.
TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చంద్రప్రభవాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ మలయప్ప
అక్టోబరు 06, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం రాత్రి శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబరు 7న రథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.