LORD HANUMA CARRIES LORD MALAYAPPA IN RAMAVATARA _ హనుమంతునిపై వేంకటాద్రిరాముడు
Tirumala 5 Oct. 19: As Lord Hanuman carried Lord Sri Malayappa Swamy in the guise of Sri Ramachandramurthy swiftly along the four-mada streets, the devotees chanted Jai Hanuman, Jai Sri Ram… Govinda Govinda with religious ecstasy.
Among all the carriers, Hanumantha Vahana occupies a significant place of a Lord being carried by another Lord. It is only Hanuman who owns the privilege of being worshipped as one of the most prominent Hindu deities.
Saranagta Prapatti-total surrenderance to His Master is clearly depicted in Hanumantha Vahana Seva, which was observed on the sixth day morning on Saturday, during the ongoing annual brahmotsavams at Tirumala.
The Hanuman Veshadharis exhibited by different dance troupes in front of Vahanam added flavour to the vahana seva. The devotees sitting in galleries enjoyed the colourful performances along with vahana sevas.
TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హనుమంతునిపై వేంకటాద్రిరాముడు
అక్టోబరు 05, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
స్వర్ణరథం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరుగనుంది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిస్తాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది.
గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు.
గజ వాహనం – కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.