LORD KALYANA VENKATESWARA RIDES GARUDA VAHANAM_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

Srinivasa Mangapuram, 10 February 2018: Every inch of the temple centre of Srinivasa Mangapuram housing the famous temple of Sri Kalyana Venkateswara Swamy has been occupied by tens of thousands of devotees on Saturday evening who converged to witness the grandeur of Sri Kalyana Venkanna on Garuda vahanam.

The processional deity of Lord Kalyana Venkateswara Swamy was taken in a procession around four mada streets on mighty Garuda Vahanam in the pleasant evening on Saturday.

The entire town donned a new look with interesting electrical mythological display themes, floral pandals etc. enhancing the beauty of Lord when taken around the mada streets on Garuda Vahanam.

On the other hand the performances by various bhajan troupes stood as special attraction during the event. The sankeertans by Annamacharya Project artistes added the religious flavor to the mega event.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, ACVSO Sri Sivakumar Reddy, DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohar, DyEE Sri Ramamurthy, Chief kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2018, ఫిబ్రవరి 10: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ శ్రీవారికి ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఊరేగి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నట్లు తెలిపారు. 108 దివ్య దేశాలలో గరుడసేవ అత్యంత విశిష్టమైనదని, అటువంటి గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అని తెలిపారు.

గరుడసేవ సందర్భంగా విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా భక్తులందరికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాలు సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి ఇన్‌చార్జ్‌ జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, అదనపు సివిఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.