LORD RAMA RIDES PEDDA SESHA VAHANAM_ పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌రాముడి అభ‌యం

Tirupati, 16 March 2018: The grand gala of vahana seva during the ongoing Brahmotsavams of Sri Kodanda Rama Swamy temple commenced with Pedda Sesha Vahanam on Friday evening.

The first vahana seva in the nine day fete witnessed huge turn out of devotees.

Bhajan troupes performed various folk arts in front of vahanam procession. While the TTD security sleuths along with srivari sevakulu guarded the procession and maintained the pilgrim crowd.

Temple DyEO Smt Jhansi Lakshmi and other staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌రాముడి అభ‌యం

మార్చి 16, తిరుపతి, 2018: తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టిరోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రామ‌చంద్రుడు పెద్ద‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవ‌త‌రించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.