KALYANA VENKANNA RIDES AS VEENAPANI _ హంస వాహ‌నంపై కల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 3 March 2021: On the second day evening Lord Kalyana Venkateswara in the guise of Saraswati Devi took a celestial ride-on Hamsa Vahana on Wednesday evening.

Decked in bedazzling jewels, draped in a red-bordered white saree, holding Veena in his hand, Lord in all His divine charm mused the devotees.

In view of Covid guidelines, the Vahana Seva was observed in Ekantam.

DyEO Smt Shanti, AEO Sri.Dhananjayulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హంస వాహ‌నంపై కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2021 మార్చి 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై అనుగ్ర‌హించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడించారు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం.

గురువారం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సింహ వాహ‌నం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ముత్య‌పు పందిరి వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.