LORD RIDES CHINNA SESHA VAHANAM IN DAMODAR KRISHNUDU AVATAR _ చిన్న‌శేష వాహ‌నంపై దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala, 17 October 2020: Lord Malayappa Swamy was taken in a procession on Chinna Sesha Vahanam on the second day of Srivari Navaratri Brahmotsavams on Saturday morning Dressed in the celestial attire of ‘Damodar Krishna’.

Lord Malayappa, holding a glob of butter in one hand and a flute on the other, was taken in a procession on the five-hooded golden vahanam inside Srivari temple due to COVID-19 restrictions.

According to mythology, Chinnasesha is the personification of Vasuki – the king of serpents. To make the human race conscious of the divine Kundalini energy the Lord rode on Chinna Sesha Vahanam and devotees beget blessings for entire family.

Sri Malayappa will bless devotees on Hamsa Vahana in the evening between 7.00pm-8.00 pm.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, Parliament member Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basant Kumar, Board members Sri DP Anant, Smt Prashanti Reddy, Sri Chippagiri Prasad, Sri Govind Hari, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

చిన్న‌శేష వాహ‌నంపై దామోద‌ర కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

అక్టోబ‌రు 17, తిరుమల 2020: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.
     
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.