LORD RIDES SIMHA VAHANAM IN ABHAYA AHWANA NARASIMHA SWAMY ALANKARAM _ సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 18 Oct. 20: On day-3 of the ongoing Srivari Navaratri Brahmotsavams Sri Malayappa Swamy rode on Simha vahanam in Abhaya Ahwana Narasimha Swamy alankaram and blessed the devotees.

The Vahana seva was held at the Kalyana Mandapam inside the Srivari temple in view of Covid restrictions and live telecast by SVBC for benefit of devotees,

Simha, the lion is a symbol of strength, dignity and leadership which reflected in today’s vahana seva of Lord Malayappa Swamy. The incarnation of Lord Vishnu as the Mrugendrudu (most ferocious and strong among the animals, Lion) is an indication of Lord as a powerful avatar to punish the wrong doers in the universe and protection of the righteous, poor and the weaker sections in the society.

In the Yoga Shastra – a Lion was seen as an embodiment of power and speed. The valor of Lord Venkateswara who had made such an animal as his vehicle is thus displayed in abundance.

The statues of Lions in the Ananda Nilayam, in the Srivari temple complex also indicate the power of Lion King. The idols of Narasimha in Yoga mudra in Srivari temple and also the idol of Lakshmi Narasimha on the way to Tirumala in Alipiri footpath route exhibits the significance of Lion (Simha) in the celestial entourage of Lord Venkateswara.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, Parliament member Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basant Kumar, Board members Sri Chavireddy Bhaskar Reddy, Sri DP Anant, Smt Prashanti Reddy, Sri Chippagiri Prasad, Sri Govind Hari, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2020 అక్టోబరు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.