LORD SIVA RIDES VYAGHRA_ వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం

Tirupati, 11 February 2018: In the ongoing annual brahmotsavams at Kapilateertham, Lord Kapileswara Swamy took celestial ride on Vyaghra Vahanam.

Usually Vyaghra-the tiger is representation of power, majesty, ferociousness. Lord Shiva who is often regarded as the Destroyer of evil power took celestial ride in the mada streeta on Sunday morning.

TTD local temles DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం

ఫిబ్రవరి 11, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన ఆదివారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బ ందాల చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.

భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి.

అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు గజవాహనం వైభవంగా జరుగనుంది. ఆద్యంతరహితుడైన శివదేవుని, ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలం.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో చంద్రగిరికి చెందిన శ్రీమతి బి.నాగరాజమ్మ బృందం, తిరుపతికి చెందిన శ్రీమతి ఎ.ఉమామహేశ్వరి బృందం, శ్రీమతి కె.హరిత బృందం కోలాట భజన, శ్రీమతి వై.గోవిందమ్మ బృందం కులుకు భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఫిబ్రవరి 14న శివపార్వతుల కల్యాణం :

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన ఫిబ్రవరి 14వ తేదీన శివపార్వతుల
కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. కల్యాణోత్సవం టికెట్ల కోసం ఒక రోజు ముందుగా ఆలయం వద్దనున్న టికెట్‌ కౌంటర్‌లో సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.