LORD SRI RAMA CHARMS ON SURYAPRABHA VAHANAM  _ సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

Tirupathi , 01 Feb. 20:The utsava Murthy of Sri Lord Sri Ramachandramurthy took out a celestial ride on Suryaprabha Vahanam in Sri Kodanda Rama Swamy temple at Tirupati on Saturday on the auspicious occasion of Radhasapthami.

In the morning, after Suprabhatam, weekly Abhishekam was performed to the Mula Virat, followed by Koluvu, Panchanga Sravanam and Sahasra Namarchana. Later between 7.30am and 9.30am, the procession of Suryaprabha Vahanam took place in four mada streets.

Later in the evening Procession of Chandraprabha Vahanam took place.

DyEO Smt Shanti, Superintendent Sri Ramesh and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01:  తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాని పురస్కరించుకొని శ‌నివారం ఉద‌యం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, మూల‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌హించారు. అనంత‌రం ఉదయం 7.30  నుండి 9.30 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు. అదేవిధంగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.