LORD SRINIVASA WEDS GODDESS PADMAVATHI ON VAISAKHA SUDDHA DASAMI DAY _ అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు

Tirumala, 25 April 2018: The grand wedding ceremony of the deities on the second day of Padmavathi Parinayotsavam witnessed huge pilgrim turnout in Tirumala.

As per the temple legend, on this day, Lord Srinivasa tied the knot to Goddess Padmavathi on the auspicious Vaisakha Suddha Dasami day.

Lord on Aswa Vahanam with His two consorts Sridevi and Bhudevi on two separate Tiruchis entered the Padmavathi Parinaya Mandpam on Wednesday evening. Like on first day, Edurkolu, Pubantata, Varanamayiram were performed symbolizing the traditional Hindu wedding.

Later the unjal seva to deities was performed amidst the chanting of vedic hymns and devotional songs.

TTD authorities, temple officials, large number of devotees took part in this celestial fete.TTD has cancelled Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva on Wednesday.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు

తిరుమల, 2018 ఏప్రిల్‌ 25శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన బుధవారం రోజున వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

బుధవారం సాయంత్రం శ్రీ స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.