LORD VENKATESWARA INVOKED INTO KALASA WITH KALAKARSHANA _ శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

Tirumala, 12 August 2018: The Ritwiks carried out the most important religious ritual “Kalakarshana” in Tirumala temple on Sunday evening as a part of the ongoing five day Astabandhana Balalaya Maha Samprokshanam fete.

Kalakarshana is a traditional process of re-invoking the various forms of the Almighty from an idol to another media like wooden icon or a Kalasha.

This celestial fete took place in Srivari temple between 7pm and 9pm. “The transferring of Divine Power of Bimbam (deity) to Kumbhabhishekam(Kalasa) was carried out amidst chanting of relevant mantras by the vedic scholars. Apart from the Mula Virat or presiding deity, the power of other deities like the Utsavarulu was also transferred in to Kalasam.

The Mula Virat consists of 12 Jeeva Sthanams which includes head, eyes, forehead, nose, throat, shoulders, bosom, midrib, feet etc. each one being a power house four kinds of Arts and taking the total to 48. All these Arts were also invoked into Kalasams placed at Yagashala.

The divine power of Sri Bhoga Srinivasa Murthy, Sri Malayappa Swamy, Sridevi, Bhudevi, Sri Ugra Sreenivasa Murthy, Sr Rama, Sita, Lakshmana, Sri Krishna, Swamy, Rukmini, Sudarshana Chakkrattalwar, Jaya-Vijaya, Dhwaja Sthambha, Padi Potu Tayaru, Prasada Potu Tayaru, Sri Yoga Narasimha Swamy, Sri Bhashyakarulavaru, Sri Vishwaksena, Sri Garudalwar, Sri Bedi Anjaneya Swamy were also invoked into Kalasams.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

ఆగస్టు 12, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

కళాకర్షణ :

రాత్రి 7 నుండి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతోపాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం) లోకి ఆవాహన చేస్తారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4 కళలు చొప్పున మొత్తం 48 కళలు ఉంటాయి. ఈ 48 కళలను కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు, శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీ చక్రత్తాళ్వార్‌, శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీక ష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీ విష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వార్‌, ప్రసాదం పోటులోని అమ్మవారు, లడ్డూపోటులోని అమ్మవారు, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళతారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుండి హోమాలు నిర్వహిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.