LORD VISITS VIKHANASA SANNIDHI_ శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
Tirumala, 16 Aug. 19: After Sahasra Deepalankara Seva on Friday evening, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi visited Sri Vikhanasa Maharshi Sannidhi.
Vikhanasa Jayanthi was observed on Thursday. Usually the Lord visits Vikhanasa Sannidhi which is located in North-mada street.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి శ్రీ మలయప్పస్వామి
తిరుమల, 2019 ఆగస్టు 16: తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శుక్రవారం ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖనస మహర్షి జయంతి ఆగస్టు 15న జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర ఆలయాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.