LUNAR ECLIPSE _ జూన్‌ 15 రాత్రి 11.53 గంటల నుండి జూన్‌ 16వ తేది ఉదయం 03.32 గంటల వరకు చంద్ర గ్రహణం

Tirumala, June 13,  2011: In view of Lunar Eclipse on 15-06-2011, from 11.53 P.M. to 03.32 A.M. [i.e., following day on 16-06-2011], the following information is provided for information to the pilgrim devotees and general public.

 

Ø  Due to Lunar Eclipse on 15-06-2011, Maha Laghu Darshan will be implemented on that day.

 

Ø  On 15-06-2011, Darshan will be closed by 04-00 P.M. and the Temple Doors will be closed by 06-00 P.M.

 

Ø  On 15-06-2011, Morning Sevas such as Suprabatham, Thomala, Archana timings are advanced by one hour. The sevas such as Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalanakra Seva are cancelled.

 

Ø  On 15-06-2011, Jyestabhishekam will start at 06-30 A.M. Gruhasthas are requested to make note of the same.

 

Ø  The following are the ‘Q’ line timings at VQC-I & VQC-II on 15-06-2011.

 

1)     Rs.300/- Prathyeka Pravesa Darshanam will be closed by 11-30 A.M. at ATC gate. Again, the pilgrims will be permitted into the ‘Q’ line on 16-06-2011 from 07-00 A.M. onwards.

 

2)     The pilgrims having Rs.50/- Sudarshan Ticket will be allowed for darshan upto 02-00 P.M. Current booking on 15-06-2011 is cancelled.

 

3)     Divya Darshan holders will be allowed in ‘Q’ line upto 11-30 A.M. Again, the pilgrims will be permitted into the ‘Q’ line on 16-06-2011 from 07-00 A.M. onwards.

 

4)     Pilgrims through Supadham entry will be closed by 11-30 A.M. Again, the pilgrims will be permitted into the ‘Q’ line on 16-06-2011 from 07-00 A.M. onwards.

 

5)     On 15-06-2011 pilgrims waiting by 6 .00 AM in compartments of VQC-II will be allowed for darshan. Again, the pilgrims will be permitted into VQC-II on 16-06-2011 from 04-30 A.M. onwards.

 

6)     Physically Challenged pilgrim ‘Q’ line will be permitted for darshan in two slots only i.e., at 10-00 A.M. & 12.00 Noon on 15-06-2011. Again, they will be permitted into the said ‘Q’ line at 10-00 A.M. on 16-06-2011 as usual.

 

Ø  Annadhanam Complex and Kalyana Katta will be closed by 11-00 P.M. on 15-06-2011 and again, they will be reopened by 04-00 A.M. on                        16-06-2011.

 

Ø  On 16-06-2011, Anga Pradakshanam is cancelled.

 

Ø  On 16-06-2011, Suprabatham, Thomala, Archana are conducted as Ekantham and Gruhasthas will not be permitted. Thiruppavada Seva will not be performed.

 

Ø  On 16-06-2011, Sarva Darshan will start at 08-00 A.M.

 

Issued by the Public Relations Officer, TTD, Tirupati.



జూన్‌ 15 రాత్రి 11.53 గంటల నుండి జూన్‌ 16వ తేది ఉదయం 03.32 గంటల వరకు చంద్ర గ్రహణం

తిరుమల, జూన్‌ 13, 2011: జూన్‌ 15 రాత్రి 11.53 గంటలకనుండి జూన్‌ 16వ తేది ఉదయం 03.32 గంటలకవరకు చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీవారి దర్శనం జూన్‌ 15వ తేది సాయంత్రం 4 గంటలకు ముగిస్తారు. ఆలయ ద్వారాలు సాయంత్రం 6 గంటలకు మూసివేస్తామని తరువాత 16వ తేది ఉదయం 4.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తామని, వెంటనే సుప్రభాతం నిర్వహిస్తామని తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు తెలిపారు.
 
చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలో 15వ తేదిన మహాలఘు దర్శనం వుంటుంది. జూన్‌ 15వ తేదిన నిర్వహించు సుప్రభాతం, తోమాల, అర్చన సేవల సమయంకన్నా ఒక గంటముందే నిర్వహిస్తారు. అదే విధంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దుచేశారు. 15వ తేదిన నిర్వహించాల్సిన జ్యేష్ఠాభిషేకం ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది.
 
ఈ సందర్భంగా వైకుంఠం 1, 2 క్యూలైన్ల సమయాల్లో ఈ క్రింది విధంగా వున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌ 15వ తేది ఉదయం 11.30 గంటలకు ఏ.టి.సి. గేట్‌ వద్ద మూసివేస్తారు. పిదప 16వ తేదిన ఉదయం 7 గంటలకు క్యూలైన్‌లో భక్తులను అనుమతిస్తారు. రు.50/- సుదర్శనంటోకన్ల కల్గిన భక్తులను 15వ తేది మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తారు. కరెంటు బుకింగ్‌ను రద్దుచేశారు. దివ్య దర్శనం టోకన్లు కలిగిన భక్తులు 15వ తేదిన ఉదయం 11.30 గంటల వరకే క్యూలైన్లలలో అనుమతిస్తారు. పిదప 16వ తేదిన ఉదయం 7 గంటలకు వీరిని క్యూలైన్లలలో అనుమతిస్తారు. జూన్‌ 15వ తేదిన ఉదయం 6 గంటల వరకు రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌నందు వేచియుండు భక్తులను మాత్రమే ఆరోజున శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. సుపధం ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్ళే క్యూలైన్‌ ఉదయం 11.30 గంటలకు మూసివేసి, 16వ తేది ఉదయం 7 గంటలకు తెరుస్తారు.
అదేవిధంగా 15వ తేదిన వికలాంగులు, వృద్దులు వెళ్ళే క్యూలైన్‌లలో వీరిని ఉదయం 10 గంటలకు, 12 గంటలకు మాత్రమే లోనికి అనుమతిస్తారు. పిదప 16వ తేది ఉదయం 10 గంటలకు ఈ క్యూలైన్‌ ద్వారా భక్తులను లోనికి అనుమతిస్తారు.
ఇక అన్నదానం కాంప్లెక్స్‌, కల్యాణకట్టలు 15వ తేది రాత్రి 11 గంటలకు మూసివేసి, 16వ తేది ఉదయం 4 గంటలకు తెరుస్తారు. 16వ తేది ఉదయం అంగప్రదక్షిణను రద్దుచేయడమైనది. జూన్‌ 16వ తేదిన సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వీటికి భక్తులను అనుమతించరు. తిరుప్పావడ సేవను రద్దుచేశారు. అదేవిధంగా 16వ తేదిన ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుందని భక్తులు ఈ మార్పులను గమనించాల్సిందిగా కోరడమైనది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.