చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టు 7న సా|| 4.30 నుండి మరునాడు ఉ|| 4 గం||ల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మూత

చంద్ర గ్రహణం కారణంగా ఆగస్టు 7న సా|| 4.30 నుండి మరునాడు ఉ|| 4 గం||ల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మూత

జూలై 29, తిరుపతి 2017: చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటల వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

ఆగస్టు 7వ తేదీన రాత్రి 10.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఆగస్టు 8న ఉదయం 12.48 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఆగస్టు 8న ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన అనంతరం ఉదయం 7.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయం, ఉప ఆలయాలైన శ్రీ కృష్ణస్వామి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయాలను కూడా చంద్రగ్రహణం సమయంలో మూసివేస్తారు.

ఆగస్టు 7న ఆర్జిత సేవలు రద్దు :

చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీన సోమవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.