MAGNIFICENT POURNAMI GARUDA SEVA _ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 27 Apr. 21:  In consonance with the practice of conducting Garuda Vahana Seva, TTD organised the grand Garuda Vahana Seva on Mada streets on, Tuesday night.

According to puranic legends, Garuda vahanotsavam is considered divine in 108 countries across the world. Acharya’s hailed Garuda as a Vedic personality and his wings regarded as symbolic of Vedic glory.

It is popularly held that the blessings of Sri Malayappa on Garuda Vahana is a divine antidote against all sins.

DyEO of Srivari temple Sri Harindranath and VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
 
ఏప్రిల్‌ 27, తిరుమల 2021 : తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
 
గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
 
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విజిఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.