GRAND CONCLUSION OF ASTABANDHANA MAHASAMPROKSHANAM AT SRI SURYANARAYANA SWAMY TEMPLE IN TIRUCHANOOR_ శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన ”అష్టబంధన మహాసంప్రోక్షణ”

Tiruchoor, 6 May 2018: The five day long Astabandhana Mahasamprokshana utsavam at Sri Suryanarayana Swamy Temple within the Sri Padmavati Ammavari Temple, Tiruchanoor concluded on Sunday.

As part of the festival vaidik rituals like Punyahavachanam, Maha Purnahuthi were performed at Gogundra mandapam in the temple complex in the morning. TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar participated in the morning ritual. Later on the TTD EO performed special rituals at the recently re-installed Sri Srinivasa temple.

The Utsava deity will be paraded on Aswa Vahanam on the Mada streets in the evening and bless the devotees.

Spl Gr DyEO Sri Munirathnam Reddy, ACVSO ShivaKumar Reddy, TTD Agama advisor Sri Sundaravarada Bhattacharyulu, Chief Kankana Bhattar Sri Surya Kumar Acharyulu, AVSO Sri Parthasarathi Reddy and others participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన ”అష్టబంధన మహాసంప్రోక్షణ”

తిరుపతి, 2018 మే 6: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ”అష్టబంధన మహాసంప్రోక్షణ” కార్యక్రమం ఆదివారం ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణతో ఘనంగా ముగిసింది.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ప్రక్కన గల గంగుండ్ర మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం 7.00 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, మహాపూర్ణాహుతి, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుచానూరులో ఇటీవల పున:ప్రతిష్టచేసిన శ్రీశ్రీనివాస ఆలయంను ోస్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.

కాగా సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై తిరు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడిస్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, టిటిడి ఆగమ సలహాదారు శ్రీసుందరవరద భట్టాచార్యులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.