GURUVANDANAM PROGRAM IN VIJAYAWADA_ జూలై 27, 28వ తేదీల్లో విజయవాడలో గురువందన మహోత్సవం

Tirupati, 26 July 2018: Following auspicious Guru Pournima, TTD will observe Guru Vandanam program in Vijayawada on July 27 and 28.

On 27th July there will be religious discourses in TTD Kalyana mandapam. While on July 28, there will be dhyanam, bhajana and satsang programs with Bhajana Mandali members from 8am to 1pm in Arjuna street located in Durga Malleswara swamy temple premises.

Dasa Sahitya Project Special Officer Sri P R Ananda Teerthacharyalu is supervising the arrangements for the Program.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 27, 28వ తేదీల్లో విజయవాడలో గురువందన మహోత్సవం

తిరుపతి, 2018 జూలై 26: గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో విజయవాడలో జూలై 27, 28వ తేదీల్లో గురువందన మహోత్సవం ఘనంగా జరుగనుంది.

సనాతన ధర్మంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గురు బోధ వల్ల శిష్యుడు భగవంతుని దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఇలాంటి గురువులను స్మరించుకుని వారి ఆశీస్సులను శిష్యులకు అందించేందుకు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి(గురుపౌర్ణమి) సందర్భంగా గురువందన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఇందులోభాగంగా జూలై 27న సాయంత్రం 3 నుండి రాత్రి 8 గంటల వరకు విజయవాడలోని టిటిడి కల్యాణమండపంలో పండితులు ఆధ్యాత్మిక, ధార్మిక సందేశాలు వినిపిస్తారు. జూలై 28న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం వద్ద గల ఆర్జున వీధిలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భజన మండళ్లతో ధ్యానం, సామూహిక భజన, గురుబోధ, గురుమహిమ ప్రవచనాలు, సంకీర్తనల ఆలాపన జరుగుతుంది.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.