MAKE ARRANGEMENTS TO CONVEY GO DARSHAN SIGNIFICANCE-TTD EO _ గో దర్శనం విశిష్టతను భక్తులకు తెలిపేలా ఏర్పాట్లు
Tirupati,14 October 2022: TTD EO Sri AV Dharma Reddy on Friday directed officials to make arrangements on both footpaths and Ghat rods to ensure that devotees get informed about the significance of Go Darshan ahead of Srivari Darshan at Tirumala.
After a spot inspection of the Sapta Go Pradakshina mandiram, Sri Venugopal Swami temple and Srivari Padala Mandapam near Alipiri, the TTD EO also instructed officials to put up sign boards that explained the significance of the Go Darshan ahead of the Srivari Darshan to devotees. He also urged officials to enhance greenery and landscaping around the Go Pradakshina mandiram.
Earlier he visited the TTD Goshala and reviewed the ongoing works of feed mixing plant, ghee manufacturing Center works and directed officials to complete works before December. After the inspection of the Agarbatti unit TTD EO suggested officials to organize more infrastructure for increasing the production of popular incense sticks.
TTD JEO Sri Veerabrahmam, Goshala Director Dr Harnath Reddy and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గో దర్శనం విశిష్టతను భక్తులకు తెలిపేలా ఏర్పాట్లు
– అధికారులకు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశం
తిరుపతి 14 అక్టోబరు 2022: అలిపిరి నుంచి నడక మార్గం , వాహనాల్లో తిరుమలకు వెళ్ళే భక్తులు సకల దేవతా స్వరూపిణి అయిన గోమాత దర్శనం చేసుకున్నాకే తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్ళేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు .
అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాల మండపం ను శుక్రవారం ఆయన పరిశీలించారు . గో దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం శ్రేష్ఠమనే విషయం, గో పూజ విశిష్టతను భక్తులకు వివరించేలా తగినన్ని బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు . అలాగే గోప్రదక్షిణ మందిరం పరిసర ప్రాంతాలు మరింత పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు .
అంతకు ముందు ఈవో శ్రీ ధర్మారెడ్డి టీటీడీ గో శాలను సందర్శించారు . అక్కడ జరుగుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ , నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు . డిసెంబర్ కు పనులు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలించారు .ఉత్పత్తి పెంచడానికి అవసరమైన యంత్రాలు , సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు .
జెఈవో శ్రీ వీరబ్రహ్మం , గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది