MALAYAPPA GLIDES ON TEPPA _ తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విహారం
Tirumala, 27 Mar. 21: On the fourth day evening, Sri Malayappa Swamy took out five rounds on the finely decorated float on Saturday along with His two consorts Sridevi and Bhudevi.
The float festival will conclude on Sunday evening on the auspicious Phalguna Pournami day.
AP High Court Judge Justice Durga Prasad Rao, TTD Addl EO Sri AV Dharma Reddy, TTD Board Members Sri DP Anantha, Sri Dhusyanth Kumar Das, CE Sri Ramesh Reddy, TTD officials participated in this float festival.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విహారం
తిరుమల, 2021 మార్చి 27: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. నాలుగో రోజు స్వామి, అమ్మవార్లు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీ దుష్మంత్ కుమార్ దాస్, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.