MALAYAPPA RIDES KALPAVRUKSHA VAHANA IN RAJAMANNAR ALANKARA _ క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప

Tirumala, 10 October 2021: On the fourth day of ongoing Srivari annual Brahmotsavams, Sri Malayappa blessed devotees in Rajamannar Alankaram on the Kalpavruksha Vahana.

 

In view of Covid regulations, Sri Malayappa was seated along with his consorts on the richly decked vahana at Kalyanotsava Mandapam inside Srivari temple on Sunday morning.

 

As per legend, Kalpavruksha is an iconic divine tree, which blesses everyone with boons including health, prosperity and longevity in life.

 

Tirumala Pontiffs, Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy and TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, TTD board members Smt Prashanti Reddy, Sri Sanat Kumar, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, JEO Smt Sada Bhargavi, Temple DyEO Sri Ramesh Babu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల, 2021 అక్టోబరు 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజ‌మ‌న్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి క‌ల్ప‌వృక్ష‌‌ వాహనంపై దర్శనమిచ్చారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ సనత్ కుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.