MALAYAPPA VISITS TIRUMALA NAMBI SANNIDHI _ శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు
Tirumala, 06 January 2024: Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi visited Sri Tirumala Nambi Temple after the Sahasra Deepalankara Seva on Saturday evening.
It is customary to hold this event on the next day of the Tanniramudu festival every year.
On this occasion, Melchat Sesha Vastram was presented to Sri Thirumala Nambi.
Tirumala Jeeyangars and temple authorities participated in this program.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, 2024 జనవరి 06: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబివారికి మేల్‌చాట్ శేషవస్త్రాన్ని సమర్పించారు.
శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ.
ఈ కార్యక్రమంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.