MANAGUDI FROM DEC 1-3_ డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు ”మనగుడి” తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 7 November 2017: The mass temple activity, Managudi will be observed across 300 temples in AP and Telengana from December 1 to 3 said, Tirupati JEO Sri P Bhaskar.

Addressing the Dharma Prachara Mandali (DPM) members in SVETA building at Tirupati on Tuesday, the JEO said, on December 1 there will be temple cleansing-Alaya Suddhi, followed by Krittika Deepotsavam on December 2 and Guru Puja on December 3 on the auspicious day of Datta Jayanti.

On November 29, the puja material for Managudi will be distributed to the respective temples.

In view of Geeta Jayanti on November 30, there will be competitions in Gita recitation from Class 6 to 9 students while on November 30 there will be religious discourse on importance of Bhagavat Gita in all district Head quarters.

HDPP Secretary Sri Ramakrishna Reddy, Project Officer Dr Venkata Ramana Babu, Epic Studies Spl.Office


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు ”మనగుడి” తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

నవంబరు 07, తిరుపతి, 2017: నేటి యువతకు సనాతన హైందవ ధర్మం, మానవీయ విలువలు, దేవాలయాలు, వాటి విశిష్టతను తెలిపేందుకు డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు ”మనగుడి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేతా భవనంలో మంగళవారం జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పవిత్ర కార్తీకమాసంలో రెండు తెలుగు రాష్టాలలోని ఎంపిక చేసిన 300 ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ఆలయాలలో డిసెంబరు 1వ తేదీ ఆలయ శుద్ధి, డిసెంబరు 2వ తేదీ కృత్తిక దీపోత్సవం, నగర సంకీర్తన, స్థానిక భజన బృందాలతో భజనలు, డిసెంబరు 3వ తేదీ దత్త జయంతిని పురస్కరించుకుని గురు పూజ నిర్వహించాలన్నారు.

అదేవిధంగా నవంబరు 29, 30వ తేదీలలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ధర్మ ప్రచార మండలి సభ్యులకు సూచించారు. నవంబరు 29వ తేదీ 6, 7, 8, 9వ తరగతి విద్యార్థులకు భగవద్గీతపై పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విశేష ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లా కేంద్రాలలో బహుమతులు, ప్రశంస పత్రాలను ప్రధానం చేయనున్నట్లు తెలియజేశారు. నవంబరు 30వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో భగవద్గీతపై సదస్సులు, చర్చ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డిసెంబరు 1వ తేదీ శ్రీహనుమంతవ్రతం నిర్వహించాలని కోరారు.

నవంబరు 20వ తేదీకి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ, బ్యానర్లు వంటి మనగుడి పూజాసామగ్రిని ఆయా ఆలయాలకు పంపించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీరామకృష్ణారెడ్డిని ఆదేశించారు. మనగుడి కార్యక్రమంలో భక్తులందరికి పుస్తక ప్రసాదం అందివ్వాలని, ఇందులో గోవిందనామాలు, పండుగలు-వాటి విశిష్టత, మనగుడి తదితర పుస్తకాలను పంపిణీ చేయలన్నారు. ఎంపిక చేసిన ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని, ఆయా ఆలయాల ప్రాశస్త్యం తెలిపేలా ఎస్వీబీసిలో కథనాలు ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిపి ప్రాజెక్టు అఫీసర్‌ డా|| వెంకటరమణబాబు, ఎపిక్‌ స్టడిస్‌ ప్రత్యేకాధికారి శ్రీ దామోదర్‌ నాయుడు, ఇతర అధికారులు, దాదాపు 80 మంది జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.