MANAGUDI FROM NOVEMBER 8-12 _ నవంబరు 8 నుండి 12వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి”
Tirupati 04 Nov 2019 ; The Karthika Masa Managudi programme will be observed in a big way in the selected Saivaite temples located in AP and TS from November 8-12.
Spiritual programmes like religious discourses will be observed during these five days.
While on November 9 Kaisika Dwadasi will be observed in the selected five temples in each district of the twin Telugu states.
On November 11, Karthika Deepotsavam will be performed in the selected temple in each district.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 8 నుండి 12వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి”
తిరుపతి, 2019 నవంబరు 04: పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 8 నుండి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శైవాలయాల్లో 21వ విడత మనగుడి కార్యక్రమం జరుగనుంది.
ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున శివాలయాలను ఎంపిక చేసి 5 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.
ఒక్కో జిల్లాలో 5 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 9న కైశిక ద్వాదశి పర్వదినం నిర్వహిస్తారు.
జిల్లాకు ఒకటి చొప్పున శివాలయంలో లేదా టిటిడి కల్యాణమండపంలో నవంబరు 11న కార్తీక దీపోత్సవం చేపడతారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.