MANAGUDI POSTERS RELEASED_ ”మనగుడి” పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరణ: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tiruchanoor, 17 August 2018: As the 12th phase of Managudi programme is slated from August 23 to 26, the wall posters for the same were released by Tirupati JEO Sri P Bhaskar in Tiruchanoor temple on Friday.

Speaking on this occasion, the JEO said, the spiritual mass programme will be observed in over 12 thousand temples in two Telugu states.

Earlier, the puja materials including vermilion, sugar candy, Kankanams(Holy Threads) were kept at the feet of presiding deity of Sri Padmavathi Devi before being dispatched to different districts in the twin Telugu states.

Temple Special Grade DyEO Sri Munirathnam Reddy, HDPP Secretary Sri Ramana Prasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

”మనగుడి” పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరణ: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఆగస్టు 17: ప్రఖ్యాత హైందవ దార్మిక సంస్థ అయిన టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ”మనగుడి” పోస్టర్లు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ అవిష్కరించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన 12 వేలకు పైగా ఆలయాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు అన్ని ఆలయాలకు శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజ సామగ్రిని ప్యాక్‌చేసి ఆయా ఆలయాలకు ధర్మప్రచార పరిషత్‌ విభాగం ద్వారా పంపిణీ చేయనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీరమణప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.