MANAGUDI PROGRAM IN TELUGU STATES- APRIL 13 (UGADI) AND APRIL 21 (SRIRAMA NAVAMI) _ తెలుగు రాష్ట్రాల్లో మనగుడి – ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 21న శ్రీరామనవమి
Tirupati, 23 Mar. 21: The TTD’s Managudi program will be conducted under the aegis of HDPP at all Sri Rama temples at district headquarters of both Telugu states on April 13(Ugadi), and April 21 (Sri Rama Navami).
TTD plans to distribute booklets on the significance of the Ugadi festival on the day besides conducting Panchanga Shravana and Ugadi pachadi for devotees benefit.
TTD is also organising Dharmic upanyasas by eminent Vedic pundits on episodes from Ramayana at all Ramalayas for seven days from April 21, the Sri Rama Navami festival.
TTD’s Hindu Dharma Prachara Parishad Secretary Acharya Rajagopalan is supervising all arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తెలుగు రాష్ట్రాల్లో మనగుడి – ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 21న శ్రీరామనవమి
తిరుపతి, 2021 మార్చి 23: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 21న శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో గల రామాలయాల్లో నిర్వహించనున్నారు.
ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతోపాటు ఉగాది పచ్చడి, ఉగాది విశిష్టత తెలిపే పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 21న శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో ఏడు రోజుల పాటు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ అంశాలపై ధార్మికోపన్యాసాలు చేస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.