MANAGUDI PROGRAMME IN HYDERABAD _ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మనగుడి ఉత్సవం
తిరుపతి, ఆగస్టు 21, 2013: – భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోతున్న నేటి సమాజంలో మన సంస్కృతిపై మక్కువ పెంచి దేవాలయాలను కాపాడుకునే బాధ్యతను పౌరులలో పెంచేందుకే ఈ మనగుడి కార్యక్రమం.
– శ్రావణ పౌర్ణమి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణం పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 21,000 ఆలయాల్లో మనగుడి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
– అన్ని ఆలయాల్లో ఉదయం 5.00 గంటల నుండి నామసంకీర్తనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
– ఆయా ఆలయ సంప్రదాయరీతిలో అభిషేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్ర సమర్పణ జరిగాయి.
– తిరుమల నుండి వచ్చిన పసుపు, కుంకుమలతో పాటు కంకణాలు, అక్షింతలు, ప్రసాదాలను ఆయా ఆలయాల దేవతల ముందుంచి, కుంకుమార్చనలు, సౌభాగ్యవ్రతాలు చేయడం జరిగింది.
– రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కంకణాలను ఈ శుభదినాన భక్తులు ధరించడం జరిగింది.
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ|| శ్రీ రామచంద్రయ్య గుడిమల్కాపురంలోని ఆలయంలో మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
– సాయంత్రం 4.00 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రధేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలల్లో 21,142 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
– రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మనగుడి కార్యక్రమంలో ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
– విశాఖపట్నం జిల్లాలోని పాడేరులోగల శ్రీరామ ఆలయంలో రాష్ట్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ బాలరాజు, అనకాపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం గౌ|| జి.శ్రీనివాస్ మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.