MANAGUDI SARE PROCESSION CONDUCTED_ ఆగస్టు 15న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tiruchanoor, 4 August 2017: In the auspicious month of Sravanam, TTD will observe the mass temple activity, Managudi in 1250 temples located across AP and TS from August 13-15, said Tirupati JEO Sri P Bhaskar.

The procession of Managudi Sare comprising holy kankanams, turmeric, vermilion etc.were carried on a procession from Asthana Mandapam after Varalakshmi Vratam in Tiruchanoor to Ammavaru temple on Friday.

Speaking on this occasion the JEO said, this religious mass programme will be observed in 1250 Sri Vaishnava temples in the holy month.
HDPP chief Sri Ramakrishna Reddy, temple Spl.gr.dyeo Sri Munirathnam Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆగస్టు 15న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ”మనగుడి” తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 ఆగస్టు 04: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో ఆగస్టు 15వ తేదీ గోకులాష్టమి పర్వాదినాన్ని పురస్కరించుకుని ”మనగుడి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనునట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మనగుడి పూజ సామగ్రికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పవిత్ర శ్రావణ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని 1250 ఆలయాలలో ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నాట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీ ఆలయ శుద్ధి, 14న గోపూజ, 15వ తేదీన గోకులాష్టమి పర్వదినాన మనగుడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

అంతకుముందు తిరుచానూరు ఆస్థాన మండపం నుండి మనగుడి పూజా సామగ్రిని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకెళ్ళారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో పసుపు, కుంకుమ, కలకండ, అక్షింతలు, కంకణాలు వుంచి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామక్రిష్ణా రెడ్డి, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.