MANAGUDI TO SUSTAIN THE VALUES OF HINDU SANATANA DHARMA-JEO _ భారతీయ సనాతనధర్మ పరిరక్షణకే ‘మనగుడి’: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati 26 August 2018: The chief motto of Managudi is to safeguard and sustain the values of Hindu Sanatana Dharma, said, Tirupati JEO Sri P Bhaskar on Sunday.
Addressing the girl students of SPW Degree and PG college in Tirupati in the college premises as a part of Managudi program, the JEO congratulated the students for actively participating in Skill Development, a programme mulled by TTD to educate it’s students in Hindu Dharma.
Later he said, TTD has designed programs like Managudi, Subhapradham, Samacharam, Epic exams etc to create awareness among the students in the richness of Hindu Dharma.
Earlier he took part in the puja of Sri Padmavathi Devi in the college premises. Afterwards he distributed Kankanams to students.
Hindu Dharma Prachara Parishad Secretary Sri Ramana Prasad, college facility, large number of students were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
భారతీయ సనాతనధర్మ పరిరక్షణకే ‘మనగుడి’: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2018 ఆగస్టు 26 ; సమాజంలో సనాతన భారతీయ హైందవ ధర్మ విలువలు నింపి, భావితరాలకు ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు నిర్ధేశింపబడిన బృహత్తర కార్యక్రమం మనగుడి అని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాలలో గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో జెఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 12 వేల ఆలయాల్లో ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు మనగుడి కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏడాది శ్రావణమాసం, కార్తీకమాసం, జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా మనగుడి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాబోవు సంవత్సరం ఉగాది పర్వదినాన మనగుడి కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో దేవాలయాలు అంతర్భాగం కావున దేవాలయాలకు శోభను పెంచేరీతిలో ఆయా ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. దేవాలయాలకు ధూపధీప నైవేధ్యలు ప్రతిరోజు నివేదిస్తు అనుదినం మనగుడి వేడుకను జరుపుకోవాలన్నారు. తద్వారా నేటి తరం వారికి కూడా మన ఆలయాల ప్రశస్త్యని తెలియ జేయగలమన్నారు.
ముందుగా కళాశాలలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జెఈవో దంపతులు మనగుడి పూజ సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కంకణాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం కళాశాల విద్యార్థినులు అన్నమయ్య సంకీర్తనలకు చేసిన కోలటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రమణప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అసుంత, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ప్రకాష్‌బాబు, కళాశాలల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.