MANAVALAMAHAMUNI SATTUMORA OBSERVED _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర

Tirupati, 01 Nov 19 : The Sattumora of one of the ardent devotees of Lord Venkateswara Sri Manavala Mahamuni was observed in Sri Govindaraja Swamy temple at Tirupati on Friday.

Snapana Tirumanjanam was rendered to the deities in the temple and in the evening the utsava murthy of Sri Manavala Mahamuni will reach the temple after a celestial procession with the deities.

Tirumala Sri Pedda Jiyar Swamy, Sri Chinna Jiyar Swamy of Tirumala, temple Special Grade DyEO Smt Varalakshmi and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

                           
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర

తిరుపతి, 2019 న‌వంబరు 01 ;తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మనవాళ మహాముని ఆలయంలో సాత్తుమొర శుక్రవారం ఘనంగా జరిగింది. అక్టోబరు 23న ప్రారంభమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు శ్రీ మనవాళ మహాముని ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.  సాయంత్రం 4.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీమనవాళ మహాముని ఆలయానికి వేంచేపు చేశారు.

సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల మ‌ధ్య‌ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి తీసుకువ‌చ్చిన అప్పాపడిని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పిస్తారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు అలంకార శోభితుడైన శ్రీ గోవిందరాజస్వామివారు ఉభయనాంచారులు, శ్రీ మనవాళ మహామునితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం శ్రీ మనవాళ మహాముని ఆలయంలో ప్రబంధపారాయణం, శాత్తుమొర, నైవేద్యం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌వికుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.