MANDALABHISHEKAM PERFORMED _ శాస్త్రోక్తంగా శ్రీ వ‌కుళమాత ఆల‌య మండ‌లాభిషేకం

TIRUPATI, 09 AUGUST 2022: Mandalabhishekam was performed in Sri Vakulamata temple located at Peruru Banda on Tuesday.

 

Both the presiding deity and utsava murty was rendered Abhishekam. Later Punyahavachanam, Viswaksena Aradhana, Sankalpam and special Pujas were performed under the supervision of Agama Advisor Sri Vishnu Bhattacharyulu.

 

The Honourable Minister of AP Sri Peddireddi Ramachandra Reddy, board member Sri P Ashok Kumar, Special Gr DyEO Smt Varalakshmi and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శాస్త్రోక్తంగా శ్రీ వ‌కుళమాత ఆల‌య మండ‌లాభిషేకం

తిరుపతి, 2022 ఆగస్టు 09: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ(పేరూరు బండ) వ‌ద్ద‌గ‌ల శ్రీ వ‌కుళమాత ఆల‌య మండ‌లాభిషేకం మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ముందుగా గర్భాలయంలో శ్రీ వకుళమాత మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని యాగశాలకు వేంచేపు చేసి కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, విష్వక్సేనారాధన, సంకల్పం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాంతి హోమం చేపట్టారు. టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.