MANUAL ON TTD DISASTER MANAGEMENT SOON- TTD JEO (HEALTH & EDUCATION) SMT SADA BHARGAVI _ టిటిడిలో విపత్తుల నిర్వహణ కోసం కరదీపిక : టిటిడి జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 22 December 2021: TTD JEO Smt Sada Bhargavi (Health&Education) said on Wednesday that a Manual on disaster management will soon be drafted for quick response during natural calamities like landslides to avert losses to TTD properties and also the safety of devotees.
Addressing a review meeting at SVETA Bhavan on the purpose of the Manual was to give correct information to devotees and boost their confidence levels in such crucial hours.
Speaking on the occasion the TTD JEO said the guidelines of the manual were being framed on the instructions of the TTD EO Dr KS Jawahar Reddy. Following which the additional EO Sri AV Dharma Reddy set up a committee with herself, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, Chief engineer Sri Nageswara Rao and DFO Sri Srinivasulu Reddy as members.
She said a working group was also formed to frame the guidelines under supervision, which will interact with engineering, IT, Health, Forest, Electrical and Security wings. Presently the team was deliberating on setting up of a control room and framing precautionary alerts etc
Earlier the JEO also explained the legal aspects of the disaster management Manuel in consultation with TTD legal officer Sri Reddappa Reddy and HR consultant Sri Ramachandra Rao.
The TTD JEO said as part of the disaster management exercise the TTD is organising a two say awareness campaign for all 69 HoDs, Besides a three-day training program legal issues, will also be conducted for all TTD officials by leading legal experts to resolve all legal issues in courts quickly, she added.
All Heads of TTD departments were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడిలో విపత్తుల నిర్వహణ కోసం కరదీపిక : టిటిడి జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2021 డిసెంబరు 22: వరదలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక(మాన్యువల్) రూపొందిస్తున్నట్టు టిటిడి జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి తెలిపారు. తద్వారా విపత్తులు సంభవించినపుడు శ్రీవారి భక్తులకు సరైన సమాచారంతోపాటు మనోధైర్యం కల్పించేందుకు వీలవుతుందన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల నేపథ్యంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించి విపత్తుల నిర్వహణకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారని తెలిపారు. ఈవో ఆదేశాల మేరకు అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైందన్నారు. ఇందులో జెఈవో(ఆరోగ్యం మరియు విద్య)తోపాటు జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులురెడ్డి సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. విపత్తుల నివారణ కోసం మాన్యువల్ తయారీని తాను పర్యవేక్షిస్తున్నానని, ఇందుకోసం వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ గ్రూపులోని ఇంజినీరింగ్, ఫారెస్టు, ఐటి, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, హెల్త్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ ప్రారంభం, ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగంపై సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు.
అంతకుముందు న్యాయపరమైన అంశాలపై విభాగాధిపతులకు జెఈవో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి న్యాయాధికారి శ్రీ రెడ్డెప్పరెడ్డి, హెచ్ఆర్ కన్సల్టెంట్ శ్రీ రామచంద్రరావు పలు కోర్టు తీర్పులను ఉదహరించి అధికారుల సందేహాలను నివృత్తి చేశారని చెప్పారు. దాదాపు 69 విభాగాల అధికారులకు రెండు రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. త్వరలో సీనియర్ అడ్వకేట్లతో న్యాయపరమైన అంశాలపై మూడు రోజుల పాటు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. తద్వారా కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు వీలవుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.