MANY STALWARTS WERE PRODUCTS OF TTD SCHOOL IN VELLORE-TTD CHARIMAN_ వేలూరులోని టిటిడి పాఠశాల మరింత అభివృద్ధికి కృషి: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌

Vellore, 13 July 2018: Complementing the proficiency of education in TTD-run Sri Venkateswara Higher Secondary School, in Vellore district of Tamilnadu, the TTD Chairman Sri P Sudhakar Yadav said, the school has the recognition of having produced many stalwarts from various fields.

The TTD Trust Board Chief on his maiden visit to the school in Vellore of Tamilnadu, addressing the students on Friday said, the school was started with a noble aim in 1876 and upgraded to Higher Secondary School in 1978. “Many versatile personalities like Sri P Ramachandran, former Governor of Kerala, Prof.Vedagiri Shanmuga Sundaram, famous economist and former VC of Manormaniyam Sundaranar University were products of the school which proves the standards of education”, he added.

The Chairman complemented the school Head Master and faculty members for maintaining the standards and continuing the legacy. He said, the school teaches the students in Telugu, Tamil and English media. The Board Chief of TTD said, he is committed towards the development of the school needs.

Later the Chairman along with his spouse visited the Golden Temple in Vellore and had the blessings of Sri Shakti Amman at Naryani Peetham.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వేలూరులోని టిటిడి పాఠశాల మరింత అభివృద్ధికి కృషి: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌

తిరుపతి, 2018 జూలై 13: టిటిడి ఆధ్వర్యంలో వేలూరులో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. తమిళనాడులోని వేలూరులో గల పాఠశాలను శుక్రవారం ఛైర్మన్‌ సందర్శించారు.

ఈ సందర్భంగా వేలూరులోని పాఠశాలలో ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ వెలుపల వేలూరులో పాఠశాల, ఢిల్లీలో ఎస్వీ కళాశాల మాత్రమే టిటిడి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి పాఠశాలలో చదువుకున్నవారు వివిధ రంగాల్లో ప్రముఖ స్థానాలకు చేరుకున్నారని, వీరిలో కేరళ మాజీ గవర్నర్‌ శ్రీ పి.రామచంద్రన్‌, మనోమణియమ్‌ సుందరనార్‌ యూనివర్శిటీ మాజీ వైస్‌చాన్సలర్‌ శ్రీ వేదగిరి షణ్ముగ సుందరం తదితరులు ఉన్నారని వివరించారు.

విద్యార్థులకు ఆధ్యాత్మిక భావాలు, మానవీయ విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా 1876వ సంవత్సరంలో ఈ పాఠశాల ప్రారంభమైందన్నారు. 1887లో టిటిడి ట్రస్టీగా వ్యవహరిస్తున్న అప్పటి మహంత్‌ శ్రీ భగవాన్‌దాసు ఈ పాఠశాలకు శ్రీ మహంత్‌ దేవస్థానం హైస్కూల్‌గా పేరు మార్చారని తెలియజేశారు. ఆ తరువాత 1952లో శ్రీవేంకటేశ్వర హైస్కూల్‌ అని పేరు పెట్టారని, 1978లో శ్రీవేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ స్కూల్‌గా మారిందని చెప్పారు. వేలూరు జిల్లాలో తెలుగు మాధ్యమం పాఠశాల ఇది ఒకటేనన్నారు. ఇక్కడ తెలుగు, తమిళం, ఇంగ్లీషు మాధ్యమాల్లో విద్యను అందిస్తున్నట్టు వెల్లడించారు.

ఆ తరువాత టిటిడి ఛైర్మన్‌ వేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకుని శ్రీ శక్తి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.