IMPROVE THE PROCUREMENT PROCESS-TTD EO_ టిటిడి కొనుగోళ్లలో మరింత ఉన్నత ప్రమాణాలు పాటించాలి

Tirupati, 28 October 2017: following the expert suggestions the procurement process in Marketing Department and warehousing mechanism need to be improved to further levels, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting on Marketing and Watehouse departments held at Annamaiah Bhavan in Tirumala on Saturday. Earlier IIM Lucknow, Associate Professor Sri S Venkataramanaiah made some fruitful suggestions to improve in both the departments through power point presentation.

The EO directed the officials concerned to throughly study the recommendations by the IIM expert and come with an action plan as per feasibility.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, FACAO sri O Balaji, EE procurement Sri Subramanyam, DyEO Sri Sridhar, Health Officer Dr Sermista were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి కొనుగోళ్లలో మరింత ఉన్నత ప్రమాణాలు పాటించాలి

తిరుమల, అక్టోబర్ 28, 2017: టిటిడిలో లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల తయారీ, ఇతర అవసరాల కోసం అవలంబిస్తున్న కొనుగోళ్ల విధానంలో మరింత ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొనుగోళ్ల విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడం, గోడౌన్లలో సరుకుల నిల్వకు సంబంధించి మరింత శాస్త్రీయమైన పద్ధతులను అవలంబించడం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఈవో కూలంకషంగా చర్చించారు. వీటికి సంబంధించి త్వరలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ముందుగా లక్నో ఐఐఎంకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా…ఎస్.వెంకటరమణయ్య కొనుగోళ్లు, నిల్వకు సంబంధించి అవలంబించాల్సిన పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీ నివాసరాజు, ఎఫ్ఏ,సిఏఓ శ్రీ ఓ.బాలాజి, ఇఇ ప్రొక్యూర్ మెంట్ శ్రీ నరసింహమూర్తి, డెప్యూటి ఈఓ శ్రీ ఇసి.శ్రీ ధర్, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.