MASSIVE RALLY BY STRONG WORKFORCE OF TTD EMPLOYEES _ తితిదే ఉద్యోగుల సద్భావన ర్యాలీకి ఛైర్మన్ నైతిక మద్దతు
తితిదే ఉద్యోగుల సద్భావన ర్యాలీకి ఛైర్మన్ నైతిక మద్దతు
తిరుపతి, ఆగస్టు 30, 2013: ఎనిమిది థాబ్దాల సుదీర్ఘ తితిదే చరిత్రలోనే తొలిసారిగా అర్చకులు, ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవు తీసుకుని చేపట్టిన సద్భావన శాంతి ర్యాలీకి ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు శుక్రవారం నైతిక మద్దతు తెలిపారు. అదేవిధంగా ఆయన సమైక్యాంధ్ర ర్యాలీలో విస్తృతంగా పాల్గొన్న తిరుపతి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
సమైక్యాంధ్ర కొరకు ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుని హోదాలో తమ గళాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా వినిపిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా కమిటీ సభ్యులతో కూడా విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు వివరించారు. అయితే తితిదే ఉద్యోగుల ర్యాలీకి తాను మద్దతు ఇవ్వలేదని కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేసిన వార్తలు వాస్తవదూరమని, తెలిసో తెలియకో ప్రసారం చేశారని ఆయన వెల్లడించారు. తాను సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నానని మీడియాలో ప్రచారం కావడం బాధాకరమని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, తనపై వచ్చిన ఆరోపణలను విశ్వసించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.