MECHANISATION OF BOONDI POTU REVIEWED _ బూంది పోటు యాంత్రీకరణపై ఈవో సమీక్ష
TIRUMALA, 28 OCTOBER 2022: A meeting was held on the Mechanisation of Boondi Potu headed by TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Friday.
The EO along with the three-member committee that was constituted to streamline the mechanisation of the Boondi mixture during September last reviewed with various companies on the possibilities of mechanisation in making boondi.
The meeting also discussed in length on the automation of the preparation of sugar syrup, boondi, transportation of flour etc.
The Committee members Sri Narasimha Murty, Sri Jagannatha Rao
Sri Sesha Sailendra, MD of Bambino Sri Subramanyam, representatives of Heat and Control Industrial Equipment, Vedic Pac Systems were also present.
Earlier all the representatives of various firms presented Power Point on their operating mechanisms.
SE2 Sri Jagadeeshwar Reddy, EE Sri Jaganmohan Reddy, DE Electrical Sri Ravishankar Reddy, DyEO Sri Harindranath, AEO Potu Sri Parthasarathy and others were present.
బూంది పోటు యాంత్రీకరణపై ఈవో సమీక్ష
తిరుమల, 2022 అక్టోబరు 28: శ్రీవారి ఆలయ బూందీ పోటు యాంత్రీకరణపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈవోతోపాటు ముగ్గురు సభ్యులు గల కమిటీ కలిసి బూందీ తయారీలో యాంత్రీకరణకు గల అవకాశాలపై సెప్టెంబరులో పలు కంపెనీలతో సమీక్షించారు. చక్కెర పాకం, బూందీ, పిండి తరలింపు తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
కమిటీ సభ్యులు శ్రీ నరసింహమూర్తి, శ్రీ జగన్నాథరావు, శ్రీ శేష శైలేంద్ర, బాంబినో ఎండి శ్రీ సుబ్రహ్మణ్యం, హీట్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్, వేదిక్ ప్యాక్ సిస్టమ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకుముందు వివిధ సంస్థల ప్రతినిధులు తమ ఆపరేటింగ్ మెకానిజమ్‌లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సమీక్షలో ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇ శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎలక్ట్రికల్) శ్రీ రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పోటు ఏఈవో శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.