MEDIA GROUP CHAIRMAN DONATES TWO PAIR OF COWS AND CALVES TO TTD _ గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళం

·      NEW SHED FOR DESI COWS AT TIRUMALA

·      TTD TO MULLING OFFLINE ISSUE OF SSD AT TIRUPATI AFTER COVID RELAXATION- TTD CHAIRMAN

Tirumala, 22 Oct. 21:  Sri Siva Kumar Sundaran, Chairman of Times of India Group of Publications on Friday, has donated two pairs of Kankrej breed of cows and calves to the TTD.

Tirupati Representative of TOI Sri Sandeep has handed over these desi bovines to the TTD chairman Sri YV Subba Reddy at SV Goshala.

The chairman who inspected the Goshala enquired about the process of butter making for the Navneeta Seva and the requirements of Desi cows for fulfilling the daily need of butter.

NEW SHED FOR DESI COWS AT TIRUMALA

Speaking on the occasion after conducting special puja to the newly added cows, TTD Chairman said a special shed to accommodate 150 Desi milch cows for providing butter for prestigious Navneeta Seva of Sri Venkateswara Swamy will be ready within two months at Tirumala SV Goshala.

He said as of now there were 60 Desi breed cows and donors have come forward to provide 70-80 more Desi cows in near future.

SSD&SED QUOTA BOOKED IN 90 MINUTES

Later he said TTD has enhanced the quota of SED and SSD tickets and tokens for months of November & December and devotees had booked entire quota within 90 minutes on Friday morning.

He said the adaptation of Jio cloud technology has enabled devotees in rural areas also to book their tickets and tokens without any technical issues.

As and when the covid restrictions are eased, TTD will consider issuing of offline SSD tokens at Tirupati, he maintained.

TTD JEO Sri Veerabrahmam, DyEO Sri Harindranath, TTD board former member Sri Shivkumar were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గోశాలకు రెండు ఆవులు, దూడల విరాళం

– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా అందజేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చైర్మన్ శ్రీ శివకుమార్ సుందరన్

తిరుమల 22 అక్టోబరు 2021: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చైర్మన్ శ్రీ శివకుమార్ సుందరన్ కాంక్రీజ్ జాతికి చెందిన రెండు ఆవులు, రెండు దూడలను శుక్రవారం దానంగా సమర్పించారు.

ఆ పత్రిక ప్రతినిధి శ్రీ సందీప్ టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవులు, దూడలను గోశాలకు అందించారు.

ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి రెడ్డి ఆవులకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటిని అందుకున్నారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి గోశాలను పరిశీలించారు. శ్రీవారి నవనీత సేవకు అవసరమయ్యే వెన్న తీయడానికి ఎన్ని లీటర్ల పాలు అవసరమవుతాయి, ఎన్ని పాలిచ్చే ఆవులు ఉండాల్సిన అవసరం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో శ్రీవారికి దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడానికి తిరుమల లోని గోశాలను విస్తరించడం జరుగుతుందన్నారు. ఇక్కడ సుమారు 150 పాలిచ్చే ఆవులను ఉంచడం కోసం రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ 60 దేశీయ జాతి ఆవులు ఉన్నాయని, మరో 70 నుంచి 80 ఆవులను దానంగా ఇచ్చేందుకు అనేకమంది దాతలు ముందుకొచ్చారని చైర్మన్ చెప్పారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టినందువల్ల నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి రూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వ దర్శనం టికెట్ల సంఖ్య గత నెల కంటే పెంచామని చెప్పావు. శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసిన గంటన్నరలోనే బుక్ చేసుకున్నారని చెప్పారు. జియో క్లౌడ్ పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు సైతం మొబైల్ ఫోన్ ద్వారా కూడా దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తిరుపతిలో కొంత మేరకు సర్వ దర్శనం టికెట్లు జారీ చేసే ఆలోచన చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తున్న గో ఆధారిత నేవేద్యం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించడం లో భాగంగా అక్టోబర్ 30 మరియు 31 వ తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రముఖులను ఆహ్వానించామన్నారు. టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది