PARKING FOR 2500 FOUR-WHEELERS IN TIRUPATI ON G-DAY-TIRUPATI JEO- గరుడ సేవనాడు తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 28 Aug 2017: The temple management of Tirumala Tirupati Devasthanams has identified two massive parking places in Tirupati for four wheelers for Garuda Seva said, Tirupati JEO Sri P Bhaskar.

A high level review meeting along with Tirupati Urban SP Sri Abhishek Mohanty and CVSO of TTD Sri A Ravikrishna on ensuing Tirumala brahmotsavam was held in the chamber of Tirupati JEO in TTD administrative building on Monday evening.

The JEO said exclusive parking places for four wheelers have been identified at Devalok-APTourism ground situated near Alipiri and at Bharatiya Vidya Bhavan school. “These two places have been ear marked exclusively to park 2500 four wheelers on Garuda Seva day. Apart from this we are making arrangements of food, water and information counters to help the pilgrims in these two places. TTD with the help of police will also be making necessary security arrangements”, he added.

Later he said, the APSRTC will operate free services from various destinations in Tirupati to drop the pilgrims at Alipiri on that day. “From this point the devotees have to travel in buses on payment of prescribed rates in ghat roads”, he added.

CE Sri Chandrasekhar Reddy, Additional CVSO Sri Sivakumar Reddy, GM Sri Sesha Reddy, SE Sri Ramesh Reddy and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గరుడ సేవనాడు తిరుపతిలో 2500 వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఆగస్టు 28, తిరుపతి, 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27న నిర్వహించే గరుడసేవకు వాహనాల్లో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానంతోపాటు దేవలోక్‌ ప్రాంగణంలో 2500 నాలుగు చక్రాల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతితో కలసి సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఆర్‌టిసి, టిటిడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో స్థలాభావం కారణంగా నాలుగు చక్రాల వాహనాలను తగ్గించాల్సిన నేపథ్యంలో తిరుపతిలోనే పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నామని, భక్తులు టిటిడికి సహకరించి పార్కింగ్‌ ప్రదేశాలను వినియోగించుకోవాలని కోరారు. తిరుమలలో వాహనాల ట్రాఫిక్‌ను తగ్గించి భక్తులు సౌకర్యవంతంగా రోడ్లపై నడిచేందుకు తిరుపతి నుంచి ఆర్‌టిసి బస్సుల్లోనే వెళ్లాలని పిలుపునిచ్చారు. జూపార్క్‌ సమీపంలోని దేవలోక్‌ ప్రాంగణంలో 32 ఎకరాల్లో, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానంతో వాహనాల పార్కింగ్‌ కోసం ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పార్కింగ్‌ ప్రదేశాల నుంచి అలిపిరి వరకు భక్తులను ఉచితంగా బస్సుల్లో చేరవేస్తామని, అక్కడినుంచి ఆర్‌టిసి బస్సుల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశాల వద్ద పారిశుద్ధ్య ఏర్పాట్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్యసౌకర్యం, సూచికబోర్డులు, లైటింగ్‌, సమాచార కేంద్రాలు తదితర వసతులు కల్పిస్తామన్నారు.

సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ గరుడసేవ నాడు తిరుమలకు పరిమితికి మించి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లకుండా తిరుపతిలోనే తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు ఆర్‌టిసి బస్సుల్లోనే తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌ రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీ నాగశివుడు, టిటిడి ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, ఎస్‌ఈలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.