GRAND SRIVARI METLA POOJA_ వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

Tirupati, 6 Jul. 19: The quarterly Srivari Metlotsavam under the aegis of TTD Dasa Sahitya Project was grandly celebrated at the Alipiri Padala mandapam on Saturday morning.

TTD JEO Of Tirupati Sri P Basant Kumar along with Sri Vidyasindu Madhava thirtha swami Of Kolar and Sri PR Anandathirthacharya, OSD Of Dasa Sahitya Project performed Metla puja to commence the holy event.

Speaking on occasion the JEO urged devotees to follow in footsteps of all saintly Dasas etc. who performed Metla puja event conducted in devotion to Lord Venkateswara.

Sri Vidyasindhu swamiji said climbing the Tirumala hill shrine was the ultimate path to Mukti and beget blessings of Lord Venkateswara.

Sri PR Anandathirthacharya, OSD Of Dasa Sahitya Project said bhajan teams from all regions had rendered traditional Bhakti sangeet and trekked the Tirumala shrine. Special dharmic training, Antakshari program in haridasa Keerthana, contests like Dasa Sahitya quiz, Etc. were conducted at the TTDs third Choultry. The bhajan Mandal members will in turn train members in their region, he said.

Earlier the bhajan mandali members walked from the choultry to Alipiri Srivari Padala mandapam where traditional rituals were performed ahead of their trekking Tirumala. Nearly 3000 bhajan members from Andhra, Telangana, Karnataka, Tamil Nadu and Kerala participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ

జూలై 06, తిరుపతి, 2019: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ , కోలార్ లోని మాధవతీర్థ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాసింధు మాధవ తీర్థ స్వామిజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ పవిత్రమైన ఆషాడమాసంలో బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. శ్రీ విద్యాసింధు మాధవ తీర్థ స్వామిజీ మాట్లాడుతూ పుణ్యఫలం లభించాలంటే కాలినడకనే తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. వేల సంవత్సరాల క్రితం విపరీత పాపపు పనులు చేసిన మాధవ అనే బ్రాహ్మణుడు, బ్రహ్మదేవుడి బోధనతో కాలినడక పర్వతాన్నిఎక్కి పాపపు పనుల పరిష్కారంతోపాటు మరుజన్మలో ఆకాశరాజుగా జన్మించారని గుర్తు చేశారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

అంతకుముందు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు, కేర‌ళ రాష్ట్రాలకు చెందిన 3,000 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.