METLOTSAVAM AT ALIPERI_ అలిపిరిలో ఘనంగా మెట్లోత్సవం
అలిపిరిలో ఘనంగా మెట్లోత్సవం
తిరుపతి, జూన్-28, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల అమృతోత్సవాల కార్యక్రమంలో భాగంగా జూన్ 30వ తేదిన సోమవారం ఉదయం 6-30గంటలకు మెట్లోత్సవం నిర్వహిస్తారు.
అలిపిరి వద్దగల పాదాల మండపం నుండి ఉదయం 6-30 గంటలకు ప్రారంభమయ్యేఈ మెట్లోత్సవం 11 గంటలకు తిరుమల చేరుకుంటుంది. పిదప తిరుమల ఆస్థానమండపమునందు భక్తులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నడచి వెళ్ళిన భక్తులందరిని ఉచితంగా స్వామివారి దర్శనానికి అనుమతించి ప్రసాదాలు ఇస్తారు.
ఈ మెట్లోత్సవంలో తితిదే పాలక మండలి చైర్మన్, సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఇతర అధికారులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భజన సంఘాలు, దాససాహిత్య, అన్నమాచార్య శరణాగతి మండలులు పాల్గొంటారు. కనుక తితిదే ఉద్యోగులు, పురప్రజలు, కళాకారులు, స్వచ్చంద సేవా సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు, భక్తులు యావన్మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.