హిందూ దేవాలయాలకు రాయితీపై విగ్రహాలు, మైక్‌ సెట్లు, గొడుగులు


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హిందూ దేవాలయాలకు రాయితీపై విగ్రహాలు, మైక్‌ సెట్లు, గొడుగులు

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 15: ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహలు, మైక్‌సెట్లు, గొడుగులను రాయితీపై అందిస్తుంది. టిటిడి రాయితీపై అందించే పైవాటిని పొందగోరు భక్తులు ఈ క్రింది మార్గాదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించగలరు.

రాతి విగ్రహాలు

– రాతివిగ్రహాల విలువ వాటి కొలతల మీద ఆధారపడి ఉంటుంది.

– ఎస్‌.సి., ఎస్‌.టి. వారికి ఉచితంగా అందిస్తారు. (వీరు కచ్చితంగా స్థానిక మండల తహసీల్దారు వద్ద నుండి ఆ ఆలయ పరిధిలో ఎస్‌.సి., ఎస్‌.టి.వారే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతపరచవలెను)

– బి.సి.,ఇతరులకు 75% రాయితీపై అందిస్తారు.

– ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, జిల్లా దేవాదాయ శాఖ ఆసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా సంబంధిత తహశీల్దార్‌ వారి అనుమతి లేఖ, ఆలయ ఫొటో, ఆలయ నమూనా (ప్లాను), దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి.

పంచలోహ విగ్రహాలు

– పంచలోహ విగ్రహాల విలువ వాటి కొలతల మీద ఆధారపడి ఉంటుంది.

– ఎస్‌.సి., ఎస్‌.టి. వారికి 90% రాయితీపై అందిస్తారు. (వీరు కచ్చితంగా స్థానిక మండల తహసీల్దారు వద్ద నుండి ఆ ఆలయ పరిధిలో ఎస్‌.సి., ఎస్‌.టి.వారే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతపరచవలెను)

– బి.సి.,ఇతరులకు 75% రాయితీపై అందిస్తారు.

– ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, జిల్లా దేవాదాయ శాఖ ఆసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా సంబంధిత తహశీల్దార్‌ వారి అనుమతి లేఖ, ఆలయ ఫొటో, ఆలయ నమూనా (ప్లాను), దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి.

మైక్‌సెట్లు

– హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలకు మైక్‌సెట్లు, విగ్రహాలు, గొడుగులు, శేషవస్త్రాలను రాయితీపై అందిస్తోంది.

– మైక్‌సెట్టును బి.సి., ఇతరులకు 50% రాయితీపై, ఎస్‌.సి., ఎస్‌.టి.లకు 90% రాయితీపై అందిస్తారు.

– ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా టిటిడి పాలకమండలి అధ్యక్షులు లేదా టిటిడి కార్యనిర్వహణాధికారి లేదా టిటిడి పాలకమండలి సభ్యుల సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో జత చేయాలి.

– పరిశీలన పూర్తయిన తరువాత ఒక ఆంప్లిఫయ్యర్‌ విత్‌ డివిడి ప్లేయర్‌, ఒక మైక్‌ విత్‌ కార్డ్‌, ఒక మైక్‌ స్టాండ్‌, రెండు పెద్ద స్పీకర్లు, ఒక చిన్న స్పీకర్‌, వంద మీటర్ల వైట్‌ వైర్‌, అన్నమయ్య సంకీర్తనల సీడీని టిటిడి అందిస్తుంది.

గొడుగులు

– గొడుగులను కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ 50 శాతం సబ్సిడీతో అందిస్తారు.

– ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా సంబంధిత తహశీల్దార్‌ వారి అనుమతి లేఖ, ఆలయ ఫొటో, దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధ్రువీకరణ పత్రము, ఆలయ నమూనా(ప్లాను) అందజేయాలి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.