MODERNIZE POTU IN A SCIENTIFIC MANNER TO INCREASE PRODUCTION-TTD EO_ లడ్డూ ఉత్పత్తి పెంచేందుకు త్వరలో పోటు ఆధునీకరణ – తి.తి.దే ఈ.ఓ

Tirumala, 13 October 2017: To increase the production of the most sought after Laddu Prasadam, there need to modernize potu in a scientific manner, asserted TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Friday, along with Tirumala JEO Sri KS Sreenivasa Raju on the development aspects of Padi Potu and Boondi Potu. The EO instructed the concerned authorities to enhance the production of laddus. The EO also directed the JEO Tirumala to find a suitable place adjacent to Boondi Potu to store the laddus.

Later the EO instructed the officials concerned to invite the renowned sweet sellers ike Haldirams, Sri Krishna Sweets and get their suggestions to renovate the both the Potu in a scientific manner. “Create a favourable environment in boondi potu for the workers so that the production of laddus and work efficiency could be increased”, he observed.

FACAO Sri Balaji, CE Sri Chandrasekhar Reddy, Temple DyEO Sri Kodanda Rama Rao, AEO Potu Sri Ashok were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

లడ్డూ ఉత్పత్తి పెంచేందుకు త్వరలో పోటు ఆధునీకరణ – తి.తి.దే ఈ.ఓ

అక్టోబరు 13, తిరుమల 2017: తిరుమల శ్రీవారి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వీకరించే లడ్డూ ప్రసాద ఉత్పత్తి సామార్థ్యాన్ని పెంచేందుకు త్వరలో పోటు ఆధునీకరణకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తి.తి.దే ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు.

శుక్రవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల శ్రీవారి పోటు విభాగానికి సంబంధించిన వివిధ అభివృద్ది పనులపై ఆయన తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కూడి సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ.ఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పోటు విభాగంలో మరింత ఎక్కువ సంఖ్యలో లడ్డూలు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సంబంధిత అధికారులు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పడిపోటును, బూందిపోటును త్వరలో పెరగనున్న లడ్డూ ఉత్పత్తికి అనుగుణంగా ఏ విధంగా అభివృద్ధి చేయగలమో దానిపై సమాలోచనలను సంబంధిత అధికారులతో నిర్వహించాలని తిరుమల జె.ఈ.ఓను ఆదేశించారు.

అదే విధంగా ప్రస్తుతం ఉన్న బూందిపోటు ప్రదేశంలోనే లడ్డూలు నిల్వ ఉంచేందుకు ఒక నూతన భవనాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. దేశంలోనే ప్రఖ్యాత తీపి మిఠాయిలు (స్వీట్లు) తయారు చేసే హల్దీరామ్స్‌, శ్రీకృష్ణ స్వీట్స్‌ వంటి వారిని ఆహ్వానించి పోటు ఆధునీకరణకు వారి సలహాలను పొందాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోటు కార్మికులకు బూంది తయారు చేసేటప్పుడు వెలువడే అధిక వేడిమి నుండి ఉపశమనం కలిగించే విధంగా వైజ్ఞానిక పరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో తి.తి.దే ముఖ్య ఆర్థిక మరియు గణాంకాధికారి శ్రీ బాలాజీ, సి.ఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ కోదండరామారావు, పోటు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.