MOHINI AVATARA VAHANAM CHARMS DEVOTEES_ మోహినీ అవతారంలో జగన్మోహనుడు

Tirumala, 17 September 2018: It is the day of reckoning for TTD, a day which attracts a huge surge of devotees in lakhs for the epochal event of Garuda seva in the evening.

But in the pleasant morning on Monday, Sri Malayalam Swamy in Mohini avatar atop an Ivory palanquin with a golden parrot (Nachiar Thirukkolam) in his hand took celestial ride along the four mada streets along with Sri Krishna Swamy on another pallaki.

The dazzling jewelry and aromatic flowers decked on the vahanam is just a blast from mythology and devotees go agog at the sight of the deity.

Legends say that it was Lord’s message that His devotees should not fall prey to worldly desires and come out of ‘Maya’ by appearing as Mohini. Besides he is also cautioning that the entire universe was a creation of his ‘Maya’ and to overcome the same, everyone should worship Him.

TTD EO Sri Anil Kumar Singhal, TTD Board members Sri Meda Ramakrishna Reddy, Smt Sudha Narayanamurthy, Sri P Ramesh Babu, Sri Raghavendra Rao, Sri N Krishna, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and large number witnessed celestial procession.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మోహినీ అవతారంలో జగన్మోహనుడు

సెప్టెంబర్‌ 17, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు సోమవారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదేరోజు తిరుమలలో శ్రీవారు శ్రీవిల్లిపుత్తూరు నుండి విచ్చేసిన ప్రత్యేక మాలలు, చెన్నై నుండి వచ్చిన అలంకృత ఛత్రాలు స్వామివారి గరుడవాహన సేవకు మరింత శోభను చేకూర్చుతాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి శ్రీకె.యస్‌.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.