MONTHLY KALYANAM IN SRI KRT_ తిరుపతి శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 13 October 2017: The monthly Kalyanotsavam at the Sri Kodanda Rama Temple was held in Tirupati on the occasion of the Punarvasu nakshatram, the birth star of Lord Rama.

The Kalyanam was performed in the morning from 11AM amidst chanting of vedic hymns by the temple priests and the participant couple were presented with uttariyam, blouse peice, anna prasadam.

Later in the evening the utsava idols of Sri Rama, Sita and Lakshman will be taken in a procession on the mada streets of the temple at 5.30PM and further accorded Unjal seva at the near by Sri Ramachandra Pushkarini.

DyEO of sub temples Smt Munilakshmi, Superintendent Sri Munikrishna Reddy were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుపతి శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2017 అక్టోబరు 13: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.