MOOLASTHANAM ELLAMMA GETS SARE FROM SRIVARU _ చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు టిటిడి సారె
Chandragiri, 17 Jan. 20: In a traditional practice, the precious gift in the form of “Sare” was sent to the famous folk goddess located at Chandragiri, Moolasthanam Ellamma, from Her beloved brother Sri Venkateswara Swamy on Friday.
In connection with the Sankranti Utsavalu Kondachuttu festival, the ex-officio member of TTD Trust board and TUDA Chairman and local legislator Dr C Bhaskar Reddy has presented the Sare on behalf of TTD.
Earlier, the Sare was brought from Tirumala to Chandragiri Sri Kodandaramalayam temple by temple Peishkar Sri Lokanatham. From there, the Sare reached Moolasthanam Ellamma temple in a grand religious procession.
The EO of the folk Goddess temple Sri Ramakrishna Reddy and Chairman Sri Sivashankar Reddy received Sri C Bhaskar Reddy and arranged darshan.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు టిటిడి సారె
తిరుపతి, 2020 జనవరి 17: చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు శుక్రవారం మధ్యాహ్నం టిటిడి తరఫున టిటిడి బోర్డు ఎక్స్ ఆఫిషియో సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మన్, ప్రభుత్వ విప్ అయిన డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సారె సమర్పించారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం నుండి వచ్చిన సారెను చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించారు.
ఈ సందర్భంగా డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి టిటిడి సారెసమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం టిటిడి తరపున అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, శ్రీవారి ఆలయ పేష్కర్ శ్రీ లోకనాథం, చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ శివశంకర్‌రెడ్డి, ఆలయ ఈవో శ్రీ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.