MORE BATTERY VEHICLES TO REDUCE POLLUTION IN TIRUMALA-TTD EO_ తిరుమలలో బ్యాటరీ(ఎలక్ట్రికల్‌) వాహనాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 15 October 2017: To protect the environs in hill town, TTD with the assistance of AP Energy Department and Government of India will soon operate 60 battery vehicles to transport pilgrims, informed TTD EO Sri Anil Kumar Singhal.

The EO along with Tirupati JEO Sri P Bhaskar took part in the Ayudha Puja performed in the Transport workshop at Tirupati on Sunday. Speaking on this occasion the EO said commenced with just two vehicles in 1948, today TTD has over 300 vehicles. “Today tens and thousands of pilgrims are transported to Tirumala with safety and security in APSRTC buses which have been rendering services since 1975. I appreciate the zero accident record by TTD drivers in the ghat roads under the stewardship of GM Sri Sesha Reddy. Today we operate a dozen free buses in Tirumala to transport pilgrims and three in Tirupati to transport pilgrims to Alipiri and Srivarimettu footpath routes. Apart from this two auto clinic vehicles, four luggage vehicles are also doing tremendous services”, he lauded.

Earlier special Puja was performed to Dharma rathams in Transport wing. AEO Sri Krishnamurty Reddy, AMF Smt Lakshmiprasanna, DI Sri Ramesh and other staffs, drivers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

తిరుమలలో బ్యాటరీ(ఎలక్ట్రికల్‌) వాహనాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

తిరుపతి, 2017 అక్టోబరు 15: కలియుగ వైకుంఠమైన తిరుమలనూ కలుష్యరహితంగా పెంపొందించేందుకు త్వరలో ఎపి ఎనర్జీ విభాగం, భారత ప్రభుత్వ సహకారంతో దాదాపు 60 బ్యాటరీ (ఎలక్ట్రికల్‌) వాహనాలను నడపనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. టిటిడి రవాణా శాఖ తిరుపతి విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ ఆదివారం స్థానిక వర్క్‌షాపులో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 1948లో రెండు వాహనాలతో టిటిడి రవాణా విభాగం ప్రారంభించి, అంచెలంచలుగా ఎదిగి 1975లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసికి టిటిడి బస్సులను ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు 300 వాహనాలు గల ఈ శాఖ ఇటు తిరుమల, అటు తిరుపతిలో శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు విశేషసేవలు అందిస్తూ స్వామివారి భక్తి వైభవవ్యాప్తికి విశేష కృషి చేస్తున్నట్టు తెలిపారు.

తిరుమలలోని 12 ధర్మరథాలు రోజుకు 300 ట్రిప్పలతో దాదాపు 60 వేల మంది భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోనడక దారి భక్తులకు 3 ధర్మరథాలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం వరకువిశేష సేవలందిస్తున్నట్లు తెలియజేశారు. 12 అంబులెన్స్‌లు, 4 ఉచిత లగేజి రవాణా వాహనాలు, రెండు ఘాట్‌ రోడ్లలో ఆటోక్లినిక్‌ వాహనాలు, క్రేన్‌లను తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞనంతో సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తిరుమలలో బ్యాటరీ కార్లు, వృద్ధులకు, వికలాంగులకు చాల ఉపయోగకరంగా నడుపుతున్నట్లు తెలిపారు.

రవాణా శాఖ సిబ్బంది అకుంఠితదీక్షతో జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి నాయకత్వంలో చక్కగా సేవలందిస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా డ్రైవర్లు తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్‌ రోడ్డును ప్రమాదరహితంగా మార్చి అందరి మన్ననలు అందుకుంటున్నారని, ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

అంతకుముందు ఈవో, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీశేషారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి విగ్రహానికిి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో రవాణా విభాగం ఏఈవో శ్రీ క్రిష్ణామూర్తిరెడ్డి, ఏఎమ్‌ఎఫ్‌ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ శ్రీరమేష్‌, డ్రైవర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.